Psychology Tricks: ఇవి మిమ్మ‌ల్ని టాప్‌లో ఉంచుతాయ్‌!

Hyderabad: జీవితంలో టాప్ పొజిష‌న్‌లో ఉండాల‌ని కోరుకోని వారు ఉండ‌రు. దానికి నిరంత‌ర కృషి, ప‌ట్టుద‌లతో పాటు ఈ సైక‌లాజిక‌ల్ టిప్స్(psychological tricks) అండ్ ట్రిక్స్ కూడా పాటించాలట‌. అవేంటంటే..

మిమ్న‌ల్ని ఎవ‌రైనా న‌లుగురిలో కానీ మ‌రెక్క‌డైనా కానీ అనుమానిస్తుంటే.. వెంట‌నే తిట్ట‌డం, కొట్ట‌డంలాంటివి చేయ‌కండి. కాసేపు వారి వైపు చూస్తూ “అంతా ఓకేనా నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా” అని అడ‌గండి. ఇలా అన‌డం వ‌ల్ల‌ అర్థంచేసుకుని వారే సైలెంట్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ‌ట‌.

మీకు ఎదుటి వ్య‌క్తి అబ‌ద్ధం చెప్తున్నారు అని తెలిస్తే.. వారి వైపే త‌దేకంగా చూడండి. ఇలా చేస్తే ఎంత‌టివారైనా ఎక్కువ సేపు నిజాన్ని దాచ‌లేరు.

ఆఫీసుల్లో, మీటింగుల్లో కొన్నిసార్లు సంభాష‌ణ కాస్తా వాద‌న‌కు దారితీస్తుంది. ఎదుటివారు వాదిస్తుంటే.. మీరు నిదానంగా వివ‌రించేందుకు ప్ర‌య‌త్నించండి. అప్పుడు మీరు వాదించ‌కుండా విష‌యాన్ని అర్థమ‌య్యేలా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు అన్న ఫీలింగ్ క‌లిగిస్తుంది. వ‌ర్క్ క‌ల్చ‌ర్‌లో ఇది మీకు ఎంత‌గానో హెల్ప్ అవుతుంది.

మీరు నిల‌బడ‌టం, కూర్చునే విధాన‌మే మీరేంటో చెప్పేస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వ్యూ స‌మ‌యాల్లో కాన్ఫిడెంట్‌గా, నిల‌క‌డ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నించండి. మీరు కాన్ఫిడెన్ట్‌గా ఉన్నారు అని ఎదుటి వ్యక్తికి అర్థ‌మ‌వుతుంది. అదే ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ అవుతుంది.