Silver: వెండి ధరించడం మంచిదా కాదా?
silver: ఎక్కువగా మన భారతదేశంలో వెండి, బంగారు ఆభరణాలనే ధరిస్తుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు కనీసం వెండి ఆభరణాలను ధరించాలని ఆశపడుతుంటారు. వెండిని ఆభరణంగా ధరిస్తే ఓపికను ఇస్తుందట. మానసిక ఆహ్లాదాన్ని కూడా పెంపొదిస్తుందని పలువురి జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అసలు వెండి ఆభరణాలు ధరించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
*విపరీతమైన కోపం ఉన్నవారు వెండి ఆభరణాన్ని ధరిస్తే శాంతంగా ఉంటారు. చిరాకుని తగ్గిస్తుంది.
*మెడలో వెండి ఆభరణాలు ధరించడం ద్వారా యాక్నే రాకుండా కాపాడుతుందట. అంతేకాదు నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది. (silver)
*మెదడు పనితీరు బాగుంటుంది. సృజనాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
*మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను తగ్గించే గుణం వెండిలో ఉందట.
*వెండిలో ఔషద గుణాలు ఉన్నాయి కాబట్టే చాలా మటుకు వైద్య పరికరాలలో వెండిని కలిపి తయారుచేస్తుంటారట.
*అయితే మీ ఒంట్లో సోడియం శాతం ఎక్కువగా ఉంటే అది వెండి రంగు ఆభరణాల రంగుని మార్చేస్తుంది.