Diwali: దీపావ‌ళి స‌మ‌యంలో ఈ జంతువులు క‌నిపిస్తే మంచిదా?

Diwali: వాస్తు శాస్త్రం ప్ర‌కారం కొన్ని ర‌కాల జంతువులు ఎదురుప‌డితే శుభ సూచ‌కం అని అంటుంటారు. అయితే దీపావ‌ళి స‌మ‌యంలో ఎలాంటి జంతువులు క‌నిపిస్తే మంచిదో ఈరోజు తెలుసుకుందాం.

చుంచు

దీపావ‌ళి స‌మ‌యంలో చుంచులు క‌నిపిస్తే మంచిద‌ట‌. కుబేరుడికి దీపావ‌ళి స‌మ‌యంలో ఏ ఇంట్లో అయితే చుంచు ఎలుక‌లు క‌నిపిస్తాయో ఆ ఇంటికి అపార సంప‌ద‌ను ఇస్తార‌ని ప్ర‌ముఖ జ్యోతిష్య నిపుణులు రిషికాంత్ మిశ్రా శాస్త్రి తెలిపారు. అంతేకాదు.. ఏవైనా స‌మ‌స్య‌లు ఉన్నా దూరం అవుతాయ‌ట‌.

పిల్లి

దీపావ‌ళి స‌మ‌యంలో ఇంట్లోకి పిల్లి వ‌స్తే ఆర్థికంగా లాభ‌ప‌డ‌తార‌ని అర్థం. ఇంటికి పిల్లి వ‌స్తోందంటే సాక్షాత్తు ల‌క్ష్మీదేవి వ‌స్తోంద‌నే భావిస్తార‌ట‌. (diwali)

బ‌ల్లి

ఇంట్లో బ‌ల్లుల్ని చూసి హ‌డ‌లిపోతుంటారు. కానీ దీపావ‌ళి స‌మ‌యంలో మాత్రం కొట్టి చంప‌డాలు వంటివి చేయ‌కండి. దీపావ‌ళి రాత్రి వేళ‌ల్లో బ‌ల్లి ప్ర‌వేశిస్తే అంతా శుభమే జ‌రుగుతుంది అనుకోవాలి.

న‌ల్ల చీమ‌లు

న‌ల్ల చీమ‌లు క‌నిపించినా శుభ శ‌కున‌మే. అందులోనూ బంగారు ఆభ‌రణాలు పెట్టిన చోట న‌ల్ల చీమ‌లు క‌నిపిస్తే ఇంకా మంచిది. ఇంటి పై క‌ప్పు మీద నుంచి న‌ల్ల చీమ‌లు పాకుతున్నాయంటే కూడా ఆర్థికంగా మ‌రింత వృద్ధి చెంద‌బోతున్నార‌ని అర్థం (diwali)

గుడ్ల గూబ‌

దీపావ‌ళి రాత్రి స‌మ‌యంలో గుడ్ల గూబ కనిపిస్తే ఎంతో మంచిది. సాక్షాత్తు ల‌క్ష్మీదేవే మీ ఇంటికి వ‌చ్చి ఆశీర్వ‌దించిన‌ట్లు.