Astrology: జాతకాలు నిజమేనా? నమ్మచ్చా?
Astrology: చాలా మందికి జాతకాల పిచ్చి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందు జాతకం చెప్పించుకుని ఏదన్నా సమస్య ఉంటే దానికి తగ్గ పరిహారం చేయించుకుంటూ ఉంటారు. కొందరైతే అసలు జాతకాలను నమ్మరు. అసలు ఈ జాతకాలు, పామ్ రీడింగ్ నిజమేనా? నమ్మచ్చా?
మీరు జ్యోతిష్యుడి వద్దకు కానీ వాస్తు శాస్త్ర నిపుణుడి దగ్గరికి కానీ వెళ్తే నూటికి 90 మంది జస్ట్ మాట్లాడటానికే డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత శాంతులన్నీ చేయించాలని దానికి ఇంకో రూ.50000 అవుతాయి అంటారు. ఇవి విని చాలా బాధేస్తుంది. ఇలాంటి వారు చెప్పేవి సాధారణంగా పనిచేయవు కూడా. ఎందుకంటే అవన్నీ దేవతా శక్తులు. దేవతా శక్తులనేవి ఎవరైతే నిస్వార్ధంగా సేవ చేస్తున్నారో వారికి మాత్రమే సాధ్యం అవుతాయి.
గ్రహ శాంతులు అని డబ్బులు తగలేసుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. గ్రహశాంతి అంటే ఏంటో తెలిస్తే ఎవ్వరూ కూడా డబ్బులు ఇవ్వరు. ఇంతకీ ఏంటీ గ్రహశాంతి. గ్రహాలు భగవంతుడిని నియమించిన పోలీస్ ఆఫీసర్లు లాంటివి. అంటే… మనం పుణ్యం, పాపం చేస్తుంటాం కదా.. దానికి మనకు సుఖాన్నో, దుఖాన్నో ఇచ్చే ఆఫీసర్లు గ్రహాలు. మనం ఒక తప్పు చేస్తే మనకు న్యాయ స్థానంలో శిక్ష పడిందనుకోండి.. ఓ పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్లి జైల్లో పెడతాడు. గ్రహ శాంతి చేయించడం అంటే ఆఫీసర్‌కి డబ్బులు ఇచ్చి శిక్ష తప్పించుకోవడం వంటిది. ఈ మార్గంలోకి ఎప్పుడూ వెళ్లకండి. గ్రహం శాంతించాలంటే రెండు మార్గాలున్నాయి. (Astrology)
మొట్ట మొదటిది ధర్మ మార్గంలో నడవడం. రెండోది ఆప్తులకు ఒళ్లు వంచి సేవ చేయండి. ఈ రెండూ చేస్తే గ్రహశాంతి ఆటోమేటిక్‌గా జరుగుతుంది. జీవితంలోని కష్టాలు పోతాయి. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ గ్రహాలన్నీ భగవంతుడు నియమించినవే. అవి భగవంతుడి ఆధీనంలో నడుస్తూ ఉంటాయి. అవేమీ చేయవు. కానీ ఆయన అనుజ్ఞ అవ్వాలి అంటే శాంతులు చేయించకుండా ఆప్తులకు సేవ చేయండి. అది చేస్తే వెంటనే ఖర్మ కరుగుతుంది.