Spiritual: ఈ తప్పులు చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందట
Spiritual: తెలిసో తెలీకో ఇంట్లో ఈ నాలుగు తప్పులు చేస్తే దరిద్ర దేవత తిష్ట వేస్తుందట. అందుకే ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా అది ఆగిపోవడమో లేకా విఫలమవడమో.. డబ్బులు మంచి నీటిగా ఖర్చు అయిపోవడం.. ఇంట్లో ఎప్పుడూ చిరాకుగా ఉండటం వంటివి జరుగుతుంటాయి. ఇంతకీ ఆ తప్పులు ఏంటంటే..
రోజూ ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి. ఇంట్లో ఎక్కడైతే దీపం కానీ వెలుతురు కానీ లేకుండా ఉంటుందో అక్కడ నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇంట్లో ఎక్కడా కూడా దుర్వాసన రాకుండా చూసుకోవాలి. అందుకే ధూపం వేసుకుంటూ ఉండాలి.
ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. కొందరు ఇల్లు శుభ్రం చేసుకోకుండా పూజా గది మాత్రమే శుభ్రం చేసి దీపాలు పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు.
ఇక చివరిది.. ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండకూడదు. భార్యాభర్తలు ఎప్పుడెప్పుడు గొడవపడతారా అని దరిద్ర దేవత ఇంటి బయట కాపలా కాస్తూ ఉంటుందట. అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి.