Naga Panchami: ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఈరోజు నాగ పంచమి (naga panchami). శ్రావణ మాసంలో పంచమి తిథి, శుక్ల పక్షం రోజున నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుంటాం. ఈ పర్వదినాన ఆచరించాల్సిన నియమాలు అలాగే ఆచరించకూడనివాటి గురించి చెప్పుకుందాం.
బ్రహ్మపురాణం ప్రకారం.. బ్రహ్మదేవుడు నాగుపాములకు ప్రతి నాగపంచమి నాడు విశేషమైన పూజలు అందుకుంటారని వరం ఇచ్చారట. ఈ నాగుల పంచమి రోజున అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగలి నాగు పాములను పూజిస్తారు. జన్మ నక్షత్రంలో ఎవరికైనా కాల సర్ప దోశం, రాహు కేతు దోషాలు ఉంటే ప్రతి నాగుల పంచమి నాడు పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి.
నాగుల పంచమి నాడు ఏం చేయాలి?
ఎంత నాగుల పంచమి నాడు మనం సర్పాలను పూజించినా అవంటే భయం ఉంటుంది. కాబట్టి.. మీరు ప్రత్యేకించి ఈరోజున పూజ చేయకపోయినా ఫర్వాలేదు కానీ పాములకు ఎలాంటి హాని కలిగించకుండా ఉంటే చాలు. సాధారణంగా పాములను ఎవ్వరూ చంపాలనుకోరు. ఆత్మరక్షణ కోసం కూడా తప్పించుకోవాలని చూస్తారు కానీ హాని చేయాలని అనుకోరు. అందులో ముఖ్యంగా నాగ పంచమి రోజు. సర్పాలకు హాని కలిగితే ఏడు తరాల పాటు దోషాన్ని అనుభవించాల్సి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. (naga panchami)
నాగ పంచమి రోజున చేయకూడని రెండో పని ఏంటంటే.. నేలను తవ్వకూడదు. నేలను తవ్వేటప్పుడు పొరపాటున అక్కడ పాము పుట్టలు వంటివి ఉన్నా.. వాటికి హాని కలిగినా కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అయినా పాముల పుట్ట దగ్గర ఎందుకు తవ్వుతాం? అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అక్కడ తవ్వకపోయినా ఈ ఒక్క రోజు తవ్వకుండా ఉంటే మంచిది అని పెద్దలు చెప్తుంటారు.
నాగుల పంచమి అనగానే భక్తులంతా కలిసి పాము పుట్టల దగ్గర చేరి గుడ్లు, పాలు పుట్టలో పోసేస్తుంటారు. అది అస్సలు మంచిది కాదు. పుట్టలో పాము ఉన్నా లేకపోయినా వాటిలో పాలు పోసేయకూడదు. ఒకవేళ పాము నిజంగా ఉంటే ఊపిరాడక చనిపోతాయి. అది అస్సలు మంచిది కాదు. నాగుల పంచమి నాడు కేవలం పుట్టకు పసుపు కుంకుమలు పెట్టి పూలు పెట్ట దండం పెట్టుకుని నాగయ్య విగ్రహాలకు పాలాభిషేకం చేస్తే మంచిది. నాగుల పంచమి నాడు కుట్లు, అల్లికల వంటి పనులు కూడా చేయకూడదని అంటుంటారు. (naga panchami)
ఏం చేస్తే మంచిది?
నాగుల పంచమి నాడు శివాలయానికి వెళ్తే ఎంతో మంచిది. శివాలయంలో నాగన్న విగ్రహాలు ఉంటే తప్పకుండా పాలాభిషేకం చేయండి. ఓం నమోస్తు సర్పేభ్యో యేకేచ పృథ్వి మాను అనే శ్లోకాన్ని చదవడం ఎంతో మంచిది. (naga panchami)