చివరి సూర్యగ్రహణం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం (solar eclipse) అక్టోబర్ 14న రానుంది. అశ్విని అమావాస్య రోజున రాబోతోంది. సూర్య గ్రహణం రోజున కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా గర్భిణులు ఆరోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. అయితే అక్టోబర్ 14న సూర్య గ్రహణం భారత్‌లో కనిపించకపోవచ్చని కూడా అంటున్నారు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలని హెచ్చరిస్తున్నారు.
*గర్భిణులు సూర్య గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. లేదంటే పిల్లలు క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి)తో పుడతారు.
*గ్రహణం పట్టిన సమయంలో అస్సలు పడుకోకూడదు. (solar eclipse)
*కుదిరితే అసలు బయటికి రాకపోవడమే మంచిది.
*ఆ రోజున షార్ప్ వస్తువులను వాడకూడదు. అంటే కుట్లు, అల్లికలు వంటివి చేయకూడదు.
*గ్రహణం సమయంలో లేదా గ్రహణం పట్టడానికి ముందు శరీరానికి కానీ తలకు కానీ నూనె రాసుకోకూడదు.
*బరువైన వస్తువులను మోయకూడదు.
*గ్రహణం సమయంలో వండుకోవడం, తినడం అస్సలు చేయకండి. ఇది గర్భిణి స్త్రీలు అస్సలు చేయకూడదు.
*గ్రహణం విడిచాక తప్పకుండా గ్రహణ విడుపు స్నానం చేయాలి.