Ratha Saptami: ఈ రాశుల వారికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Ratha Saptami: రోజూ రాశిఫ‌లాలు చూసుకుని త‌మ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోవాల‌ని ఉంటుంది. రాశి ఫ‌లాల్లో ఇచ్చే ప‌రిహారాలు, చిట్కాలు కూడా చాలా మంది క‌ఠినంగా పాటిస్తుంటారు. ర‌థ‌స‌ప్త‌మి. సూర్య భ‌గ‌వానుడి కృప ఏ రాశి వారికి ఎక్కువ‌గా ఉందో తెలుసుకుందాం. (Ratha Saptami)

మేషం (Aries)

చేప‌ట్టిన ప‌నులలో విజ‌యం సాధిస్తారు. స‌మాజంలో ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచ‌నాలు నిజం అవుతాయి. ఆప్తుల నుంచి శుభ‌వార్త వింటారు. విలువైన వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. కీలక స‌మ‌యంలో సొంత నిర్ణ‌యాలు క‌లిసి వ‌స్తాయి.

వృష‌భం (Taurus)

ఆరోగ్య స‌మ‌స్య‌లు బాధిస్తాయి. చేప‌ట్టిన ప‌నుల‌లో అవాంత‌రాలు క‌లుగుతాయి. నూత‌న ప్ర‌యాణాలు క‌ల‌సిరావు. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. వ్యాపార‌, ఉద్యోగాల్లో గంద‌ర‌గొళ ప‌రిస్థితులు ఉంటాయి. కొన్ని వ్య‌వ‌హారాల‌లో ఆలోచ‌న‌లు స్థిరంగా ఉండ‌వు. కుటుంబ స‌భ్యుల‌తో మాట ప‌ట్టింపులు ఉంటాయి.

ALSO READ: Shivaratri కి మ‌హా శివ‌రాత్రికి తేడా ఏంటి?

మిథునం (Gemini)

వ్యాపారాల్లో లాభ‌సాటిగా సాగుతాయి స‌న్నిహితుల నుంచి ధ‌న లాభ సూచ‌న‌లు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. చేప‌ట్టిన ప‌నుల‌లో వ్య‌వ‌హారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూత‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

క‌ర్కాట‌కం (Cancer)

ఉద్యోగాల్లో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. సోద‌రుల‌తో స్థిరాస్థి వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. వ్యాపారాలు మంద‌గిస్తాయి. చేప‌ట్టిన ప‌నుల‌లో అవాంత‌రాలు ఉంటాయి, బంధువుల‌తో వివాదాలు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి

సింహం (Leo)

గృహాన శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. ఇంటా బ‌య‌టా ప‌రిస్థితులు అనుకూలిస్తాయి. రాజ‌కీయ స‌మావేశాల్లో పాల్గొంటారు. చేప‌ట్టిన వ్య‌వ‌హారాల్లో విజ‌యం సాధిస్తారు. విలువైన గృహోప‌క‌ర‌ణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్త‌రిస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన పురోగ‌తి క‌లుగుతుంది.

క‌న్య‌ (Virgo)

స‌న్నిహితుల‌తో విందు వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విష‌య‌మై ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. సోద‌రుల‌తో స‌ఖ్య‌త క‌లుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల‌లో కార్య సిద్ధి క‌లుగుతుంది. స్థిరాస్థి కొనుగోలు ప్ర‌యత్నాలు ఫ‌లిస్తాయి.

ALSO READ: Shiva: పొర‌పాటున కూడా శివ‌య్య‌కు ఇవి స‌మ‌ర్పించ‌కండి

తుల‌ (Libra)

దైవ ద‌ర్శ‌నాలు చేసుకుంటారు. సోద‌రుల‌తో వివాదాలు చికాకు ప‌రుస్తాయి. దీర్ఘ‌కాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూత‌న రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. స్వ‌ల్ప ఆరోగ్య స‌మస్య‌లు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ‌ప‌రుస్తాయి. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. ఇంటా బ‌య‌టా చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృత్తి వ్యాపారాల్లో ఆక‌స్మికంగా నిర్ణ‌యాలు మార్చుకుంటారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాలు మంద‌గిస్తాయి. చేప‌ట్టిన ప‌నుల‌లో ఫ‌లితం క‌నిపించ‌దు. దైవ సేవ‌లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్ర‌య‌త్నాలు మంద‌కొడిగా సాగుతాయి.

ధ‌నుస్సు (Sagittarius)

ఆపాత స‌మ‌స్య‌లు తీరి ఊర‌ట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభ‌కార్య ఆహ్వానాలు అందుతాయి. స‌న్నిహితుల‌తో ఊహించ‌ని మాట ప‌ట్టింపులు ఉంటాయి. చేప‌ట్టిన ప‌నులు స‌కాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోటు ఉండ‌దు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిక‌రంగా సాగుతాయి.

మ‌క‌రం (Capricorn)

ఆత్మీయుల నుంచి శుభ‌వార్త‌లు అందుతాయి. వాహ‌న సౌఖ్యం ఉంది. స‌మాజంలో ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. ఉద్యోగస్థుల‌కు ప‌దోన్న‌తులు పెరుగుతాయి. దైవ చింత‌న పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంట‌ర్వ్యూలు అందుతాయి.

కుంభం (Aquarius)

ఉద్యోగ వాతావ‌ర‌ణం గంద‌ర‌గోళంగా ఉంటుంది. కుటుంబీకుల‌తో ఆల‌యాల‌కు వెళ్తారు. కొన్ని వ్య‌వ‌హారాలు ఒత్తిళ్ల‌తో కానీ పూర్తి కావు. స‌మాజ సేవలో పాల్గొంటారు. దూర ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. మొండి బాకీలు కొన్ని వ‌సూల‌వుతాయి.

మీనం (Pisces)

ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. దీర్ఘ‌కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేస్తారు. చిన్న పాటి అనారోగ్య సమ‌స్య‌లు బాధిస్తాయి. స్వ‌ల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. కుటుంబ వ్య‌వ‌హారాల్లో ఆలోచ‌న‌లు స్థిరంగా ఉండ‌వు.