పూజా సమయంలో హారతి ఆరిపోతే అరిష్టమా?
Spiritual: పూజ చేస్తున్న సమయంలోలో లేక ఆలయంలోనో హారతి కొండెక్కితే (ఆరిపోతే) అపచారమని అరిష్టని భయపడుతుంటారు. ఇవన్నీ టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావం వల్ల ఏర్పడిన అపోహలనే చెప్పాలి. హారతి కొండెక్కితే ఏదో అపచారమని మనకు ఎక్కడా శాస్త్రాల్లో చెప్పలేదు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు, కర్పూరం క్వాలిటీ బాలేనప్పుడు హారతి కొండెక్కుతుంది. గాలి లేనప్పుడు మంచి కర్పూరం వాడితే అలా ఏమీ జరగదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో దిగులు అవసరం లేదు.