Spiritual: పూజలో పాడు ఆలోచనలు వస్తున్నాయా?
Spiritual: పూజ చేస్తున్న సమయంలో మనసు పరి పరి విధాలుగా వెళ్లిపోతుంటుంది. ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటాయి. ఆ ఆలోచనల్లో పాడు ఆలోచనలు కూడా ఉంటాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు లెంపలేసుకుని మళ్లీ పూజపై దృష్టి పెడుతుంటాం. అసలు పూజ, ధ్యానం చేస్తున్నా పాడు ఆలోచనలు వస్తే దానిని ఎలా ఆపుకోవాలి?
చాలా మంది పాడు ఆలోచనలు వస్తున్నాయని పూజ చేయడమే మానేస్తుంటారు. అది చాలా పొరపాటు. ఆ తప్పుడు పని మాత్రం ఎప్పుడూ చేయకండి. మనం పుట్టుకతోనే మహాత్ములం కాదు కదా..! చిన్నప్పటి నుంచి మన ఆటలు, మన స్నేహాలు, మన సినిమాలు, చదువులు, ఉద్యోగాలు.. ఇలా అన్నీ ఉంటాయి. తర్వాత ఎప్పుడో మన జీవితంలో మన అదృష్టం బాగుండి ఆధ్యాత్మికత వైపు వెళ్తే అప్పుడు పూజలు మొదలుపెట్టాక ఆ పాడు ఆలోచనలు ఎలా అదుపు చేయాలని అన్న ఆలోచన రావడమే అదృష్టం అని చెప్పాలి. అందుకే దాని కారణంగా పూజ మాత్రం మానేయకండి.
ALSO READ: Tirumala లో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి
శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. పరమేశ్వరా.. నువ్వేమో కపాల మాల వేసుకుని పెద్ద జడలు ఒళ్లంతా బూడిద పూసుకుని ఉంటావు. మూడు కళ్లు ఉంటాయి. నువ్వు భిక్షకు వెళ్తే నిన్ను చూసి ఎవరు భిక్ష వేస్తారయ్యా? కానీ నీకో ఉపాయం చెప్తా. ఎవరైనా భిక్షకు వెళ్తూ కోతిని పట్టుకెళ్తే నీకు అందరూ తేలిగ్గా భిక్ష వేస్తారు అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ కోతి అంటే.. నా దగ్గర ఓ కోతి ఉంది స్వామి. అదెప్పుడూ మోహంతోనే తిరుగుతుంటుంది. స్త్రీల సౌందర్యం అనే కొండల మీద, ఆశ అనే కొమ్మల మీద వేలాడుతూ ఉంటుంది. అదే ఆ కోతికి ఉన్న దుర్ల్యక్షం. అదెవరో కాదు నా మనసు. స్వామి.. ఆ కోతిని మీతో పాటు పట్టుకుపో అప్పుడు భిక్ష దొరుకుతుంది అని. మరి అదెప్పుడూ స్థిరంగా ఉండనప్పుడు మరి నా దగ్గర ఎందుకుంటుంది అని అడిగారు స్వామి. అప్పుడు శంకరాచార్యుల వారు సమాధానం ఇస్తూ.. కోతి మాట వినకపోతే బంధించినట్లు.. భక్తి అనే బంధనాన్ని వేస్తే మీకూడా తీసుకుపోండి స్వామి అప్పుడు మీకు భిక్ష దొరుకుతుంది. నా కోతి మీ ఆధీనంలో ఉంటుంది అని సమాధానం ఇచ్చారు. (Spiritual)
ఇక్కడ శంకరాచార్యుల వారు ఆయన గురించి చెప్పడంలేదు. ఆయన సాక్షాత్తు శివ స్వరూపం. మనలాంటి సాధకుల గురించే ఆయన అలా మాట్లాడారు. అంటే మన మనస్సు అటూ ఇటూ పరిగెడుతుంది అని అల్లాడిపోకండి.. దానిని భగవంతుడికి అప్పజెప్పండి అప్పుడు అది పడుంటుంది. ఆ మనసును ఎలా అదుపు చేయాలి. దానికి మూడు టెక్నిక్‌లు ఉన్నాయి. అవే SSS.
మొదటి ఎస్ అంటే సంభోజనం. అంటే మనం తినే అన్నం. అన్నానికి సంబంధించిన మన రుషులు ఒక మాట చెప్పారు. మనం తిన్న అన్నం కొన్ని రోజులు పోయాక మన మనసు కింద మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదెలాగంటే… ఉదాహరణకు ఒక మనిషికి పాజిటివ్ ఆలోచనలు ఉంటే.. మరో మనిషికి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి.. నెగిటివ్ మనిషి రోజూ పాజిటివ్‌గా ఆలోచించే మనిషికి అన్నం వండి పెట్టాడనుకోండి.. ఇతను కూడా నెగిటివ్‌గా మారిపోతాడు. అన్నానికి అంత శక్తి ఉంటుంది. మనం అన్నం వండేటప్పుడు ఏ రకమైన భావాలు కలిగి ఉంటామో ఆ భావాలు అన్నంలోకి వస్తాయి. అలాగే అన్నం తినేటప్పుడు ఏ రకమైన భావాలు కలిగి ఉంటామో అవి కూడా అన్నంలోకి వచ్చి చివరికి మన మనసులా మారిపోతాయి. అందుకే అన్నం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నం వండుకునేటప్పుడు పాజిటివ్ ఆలోచనలతో వండుకోండి. తిన్నాక కాసేపు ధ్యానం చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు పాడు ఆలోచనలు ఆగిపోతాయి.