Current Bill తక్కువ రావాలంటే ఇలా చేయండి
Hyderabad: కొందరి ఇళ్లల్లో తక్కువ కరెంట్ వాడినా బిల్లులు(current bill) మాత్రం వాచిపోతుంటాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఈ టిప్స్ పాటిస్తే నెల నెలా తక్కువ కరెంట్ బిల్లుతో(current bill) ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
పాత బల్బులను మార్చేయండి
ఇంట్లో బల్బులు పాతవైపోతే వెంటనే వాటిని మార్చేయడం బెటర్. పాతబడిన ఫిలమెంట్లు ఎక్కవ కరెంట్ లాగుతాయి. దాని వల్ల మీపై బిల్లు భారం ఎక్కువ ఉంటుంది.
ఏసీ టెంపరేచర్
ఎండాకాలంలో ఏసీ ఎంత ఎక్కువ టెంపరేచర్‌లో ఉంటే అంత చల్లగా ఉంటుంది అనుకుంటారు. అది పొరపాటు. ఎండ ఎక్కువున్నా తక్కువున్నా ఏసీ టెంపరేచర్ ఎప్పుడూ 24 డిగ్రీల్లోనే ఉండాలి. ఒక్క పాయింట్ తగ్గినా బిల్లు తడిసిమోపెడవుతుంది.
ఆఫ్ చేసేయండి
ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుకలో లేనప్పుడు స్విచ్ ఆన్‌లోనే ఉంచకండి. ఎప్పటికప్పుడు ఆపేస్తూ ఉండండి. దీని వల్ల చాలా బిల్లు ఆదా అవుతుంది.
పాతవి వద్దు
ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆలోపు వాటిని వాడేస్తేనే మంచిది. వాటి టైం పీరియడ్ దాటినా వాడుతూ ఉంటే ఎక్కువ కరెంట్ లాగుతుంది.
చార్జింగ్ మితంగా
ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ ముఖ్యమే కానీ ప్రతి గంటకోసారో లేదా చార్జింగ్ స్విచ్ ఆన్ చేసి వదిలేయడం లాంటివి చేస్తే మనకు తెలీకుండానే కరెంటు ఎక్కువ యూనిట్లు కాలిపోతుంది.