తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు!
తులసి మొక్కని ‘మూలికల రాణి’ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసిది ప్రత్యేక స్థానం. ప్రాచీన కాలం నుంచీ మన సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగమైన తులసిని చాలామంది పరగడపునే తీసుకుంటారు. భారతదేశంలో దాదాపు ప్రతి ఇంటా కొలువయ్యే తులసిలోని పోషకాలు, ఔషధ గుణాల గురించి ఎన్నో అధ్యయనాలు జరిగాయి. క్రమం తప్పకుండా రోజూ రెండు తులసి ఆకులను తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చనేది నిపుణుల మాట. ఔషధ రాణి తులసి అందించే ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం..
* జలుబు, మంట, మలేరియా, గుండె జబ్బులు, తలనొప్పి, కడుపులోనొప్పి, మూత్రపిండాల్లో రాళ్ళు వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడానికి తులసిలోని యాంటీ బయాటిక్ లక్షణాలు ఉపయోగపడతాయి. తులసి ఆకులలో విటమిన్ ` ఎ, సి,కె, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు తులసి ఆకుల్లో ప్రొటీన్, ఫైబర్ కూడా ఉంటాయి.
* తులసిలో పుష్కలంగా ఉండే జింక్, విటమిన్ సి శరీరంలో సహజమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో అపారమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తులసి ఆకుల సారం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* తులసిలో ఉంటే కెఫేన్, సినిమోల్ మరియు యూజినాల్ జలుబును తగ్గించడంలో, సహాయబడుతుంది. తులసి ఆకుల రసాన్ని తేనె మరియు అల్లంతో కలిపి తీసుకుంటే బ్రొన్కైటిస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూ, దగ్గు మరియు జలుబు వంటి వాటిలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* తులసిలో యాంటీ ` బ్యార్టీయల్, యాంటీ వైరల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. వీటిలో ఉండే యూజినాల్ నొప్పిని తగ్గించే గుణాలు శరీరంలో నొప్పులను తగ్గిస్తాయి.
* తులసి రక్తంలో లిపిడ్ కంటెంట్‌ను తగ్గించడం, ఇస్కేమియా, ప్ప్రోక్‌ను అణిచివేయడం, రక్తపోటును తగ్గించడం, అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కారణంగా గుండె సంబంధిత వ్యాధుల చికిత్స, నివారణపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఒసిమెమోసైడ్స్ ఎ, బి సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడులోని న్యూరోట్రాన్మిటర్లు సెర్కోటొనిస్, డొపమైన్‌లను సమతుల్యం చేస్తాయి. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, రక్తపోటును తగ్గిస్తాయి.
* తులసిలో ఫైటోకెమికల్స్, యాంటీ ` ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం, కాలేయం, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. తులసి టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
*తులసి ఆకులలో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడి మధుమేహం సమస్యలను నివారిస్తాయి.