Puja: పూజలో ఈ తప్పు చేస్తే .. ఆరోగ్యం పైన కొడుతుంది
Puja: పూజా సమయంలో కొన్ని తప్పులు తెలీక జరిగిపోతుంటాయి. కొన్ని రకాల తప్పులు చేస్తే అవి ఇంట్లో వారి ఆరోగ్యంపై కొడుతుందని నిపుణులు చెప్తున్నారు. మనమంతా దేవుడిని పూజిస్తున్నప్పుడు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వమని కోరుకుంటాం. ఇలా కోరుకుంటూనే దేవుడికి పెట్టే దీపపు నూనె నుంచి హారతి ఇచ్చే కర్పూరం వరకు అన్నీ అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే కల్తీవే వాడుతుంటాం. ఇవన్నీ మనం కావాలని చెయ్యం. ఏది మంచిదో ఏది కల్తీదో తెలీక పూజా సామాగ్రి స్టోర్ నుంచి అలా కొనేసి వాడేస్తుంటాం. తెలీకుండా ఈ తప్పును అందరూ చేస్తున్నారు.
మీకు ఒక విషయం తెలుసా..? 2018లో ఓ ఎన్నారై జంట ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయానికి వెళ్లి… స్వామి వారిని దర్శించుకుని బయటికి వస్తుంటే.. వారి కళ్లు ఎర్రగా అయిపోయి కన్నీళ్లు వస్తున్నాయట. అప్పుడు వారిని చూసి ఓ స్వామీజీ ఏమైంది వీరికి ఎందుకు ఏడుస్తున్నారబ్బా అని ఆరా తీసారట. దానికి వారు చెప్పిన సమాధానం విని స్వామీజీ షాకయ్యారు. ఇంతకీ వారు చెప్పిన సమాధానం ఏంటంటే.. గుడిలో వెలిగించిన అగరుబత్తీల పొగకు కళ్లు మండుతున్నాయ్ అందుకే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. (Puja)
దీనిని బట్టే మీకు అర్థమై ఉండాలి.. మనం ఎలాంటి కల్తీ వస్తువులను పూజకు వాడుతున్నామో. ఉజ్జయిని మహంకాళేశ్వర్ లాంటి ప్రసిద్ధ ఆలయంలోనే ఇలాంటి కళ్లు మండిపోయేలా కల్తీ అగరుబత్తులు వాడుతున్నారంటే.. ఇక మనం ఎంత చెప్పండి? మరి ఆరోగ్యవంతమైన, పరిశుద్ధమైన అగరుబత్తీని భగవంతుడికి సమర్పించడం ఎలా? పరిపూర్ణానంద స్వామి అనే పెద్దాయనకు కూడా ఈ ఆలోచన వచ్చే తన గౌ దర్బార్ ద్వారా స్వచ్ఛమైన మూలికలు, తేనెను వాడి స్వచ్ఛమైన అగరుబత్తీలను తయారుచేయడం మొదలుపెట్టారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఆ అగరుబత్తీలు సరిగ్గా కుదరలేదు. అలా పరిపూర్ణానంద స్వామీజీ చలవతో ఎంతో మంది గౌ దర్బార్ నుంచి తయారైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీలైతే మీరు కూడా ప్రయత్నించండి.