పూజకి ముందు ఆహారం తింటే ఫలితం ఉంటుందా?
Spiritual: చాలా మంది పూజకి ముందు కాఫీ, టీలు తాగేసి టిఫిన్లు చేసేస్తుంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే ఫలితం ఉంటుందా? పూజకి ముందు ఏమీ తినకూడదు అని మనకు పెద్దలు చెప్తుంటారు. వారు అలా ఎందుకు చెప్పారంటే బాగా తినేసి పూజ చేస్తుంటే ఆవలింతలు వస్తుంటాయి. పూజ సరిగ్గా చేయలేకపోతారు. అందుకని ఈ నియమం పెట్టారు కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు.
అలాగని దానిని తప్పక ఆచరించాలని లేదు. పూజ అయ్యే వరకు ఓపికగా ఆకలిని తట్టుకునేవారు పూజ అయ్యక తినచ్చు. కానీ బీపీ, షుగర్, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ నియమం వర్తించదు. ఒక పూజ చేస్తే ఫలితం రావాలంటే మీరు భక్తితో చేయాలి. ఆ భక్తి లేకుండా నామమాత్రంగా పూజ చేస్తే మీరు కటిక ఉపవాసం ఉండి కూడా ఫలితం ఉండదు.