మధ్య వేలికి బంగారు ఉంగ‌రం ఎందుకు ధ‌రించ‌కూడ‌దు?

Can a gold ring be worn on the middle finger?

Gold Ring:  చాలా మంది మ‌ధ్య వేలికి బంగారు ఉంగరాన్ని ధ‌రించ‌కూడ‌దు అని చెప్తుంటారు. ఇందుకు కార‌ణమేంటో ఎందుకు ధ‌రించ‌కూడ‌దో తెలుసుకుందాం.

బంగారం సూర్యుడికి సంబంధించిన లోహం కాబట్టి.. దానిని ఏ రూపంలో ధ‌రించినా శారీర‌కంగా మాన‌సికంగా ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మ‌ధ్య వేలు శ‌ని దేవుడికి సంబంధించిన‌ది. సూర్యుడు శ‌ని ఆపోజిట్ గ్ర‌హాలుగా ఉంటాయి. అంటే ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. అందుకే మ‌ధ్య వేలికి ధ‌రిస్తే శ‌ని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండి సూర్య ప్ర‌భావం త‌గ్గుతుంది అంటారు. బంగారు ఉంగ‌రాన్ని మ‌ధ్య వేలికి ధ‌రిస్తే ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోతార‌ట. జీవితంలో ఏదీ కాలిసి రాదు. ఏ ప‌ని చేసినా పూర్తి కాదు. ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య వెంటాడుతూనే ఉంటుంద‌ట‌.