Black Thread: నల్లదారం ఎందుకు కట్టుకోవాలి?
Hyderabad: అబ్బాయిలు, అమ్మాయిల ఎడమ కాలికి ఓ నల్ల దారం (black thread) ఉంటుంది. దిష్టి తగలకుండా కట్టుకుంటారని పెద్దలు చెప్తుంటారు. అసలు కాలికి నల్ల దారం కట్టుకుంటే కలిగే ఫలితాలేంటో చూద్దాం.
*నలుపు రంగు అనగానే అదేదో అశుభం అనుకుంటారు కానీ నిజానికి నలుపు అనేది ప్రొటెక్టివ్ కలర్. కాలికి నల్ల దారం కట్టుకుంటే దుష్టశక్తుల కళ్లు మనపై పడవు అని పెద్దల నమ్మకం.
*కొందరి కళ్లు మంచివి కాదు అంటుంటారు కదా. వారి నుంచి కూడా మనల్ని ఆ నల్ల దారం రక్షిస్తుందట.
*నల్ల దారం కట్టుకుంటే శని దేవుడు కృప మనపై ఎప్పుడూ ఉంటుందట. శని అనగానే తిట్టేసుకోకండి. మనకు తెలీకుండానే శని దేవుడు మనకు మంచి చేస్తుంటాడు. (black thread)
*నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్‌గా మార్చే శక్తి ఈ నల్ల దారానికి ఉంటుందట.
*ఈ దారం కట్టుకున్నవారికి సక్సెస్, మంచి భవిష్యత్తు ఉంటుంది.
*నల్ల దారం కట్టుకునేవారిలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. (black thread)