Solar Eclipse: ఏ రాశుల వారికి మంచిది? ఎవ‌రికి అశుభం?

Solar Eclipse: మొన్న‌నే కేతుగ్రస్త చంద్ర‌గ్ర‌హ‌ణం వ‌చ్చి వెళ్లింది. మ‌న భార‌త‌దేశంలో క‌నిపించ‌లేదు కానీ దాదాపు 360 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌చ్చిన గ్ర‌హణం కావడంతో చాలా మంది చూడాల‌నుకున్నా చూడ‌లేక‌పోయారు. ఇక సూర్య గ్ర‌హ‌ణం రాబోతోంది. దీనిని కూడా కేతుగ్ర‌స్త సూర్య‌గ్ర‌హ‌ణం అనే అంటారు. మ‌రి ఈసారి సూర్య‌గ్ర‌హణం ఎప్పుడు వ‌స్తుంది? ఏ స‌మ‌యంలో వ‌స్తుంది? ఏ రాశుల వారికి శుభం క‌లుగుతుంది? ఏ రాశుల వారికి అశుభం క‌లుగుతుంది? వంటి అంశాల‌ను తెలుసుకుందాం.

ఈసారి సూర్య‌గ్ర‌హ‌ణం ఉగాదికి ముందే వ‌స్తోంది. ఇది అరిష్టం అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం ఏప్రిల్ 8న రాబోతోంది. మ‌న . ఈసారి గ్ర‌హ‌ణం ఐదున్న‌ర గంట‌ల పాటు ఉండబోతోంది. దాదాపు 380 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇంత ఎక్కువ సేపు ప‌ట్టే గ్ర‌హ‌ణం ఇదే కావ‌డం విశేషం. అయితే… ఈ గ్ర‌హ‌ణం భార‌త‌దేశంలో క‌నిపించ‌దు. ఎందుకంటే.. భార‌తీయ కాల‌మానం ప్ర‌కారం గ్ర‌హ‌ణం రాత్రి 9:21 నుంచి 2:15 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. (Solar Eclipse)

ఏప్రిల్ 4 నుంచి శ‌నిగ్ర‌హం పూర్వాబాధ్ర‌ప‌ద న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇది శ‌నిదేవుడి న‌క్ష‌త్రం. దాంతో ఏలినాటి శ‌నిని అనుభ‌విస్తున్న క‌ర్కాట‌క‌, వృశ్చిక‌, మీన‌, కుంభ‌, మ‌క‌ర రాశి వారికి నెల రోజుల పాటు అశుభ ఫ‌లితాలు క‌ల‌గ‌నున్నాయ‌ని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్ర‌హణం రేవ‌తి న‌క్ష‌త్రం, మీన రాశిలో ఏర్ప‌డుతోంది కాబ‌ట్టి మీన‌, మేష, సింహ‌, ధ‌నుస్సు రాశుల వారికి అధ‌మ ఫ‌లితం ఇస్తుంది. దీని వ‌ల్ల అనారోగ్యం, అప్పుల పాల‌వ్వ‌డం వంటి అశుభ ఫ‌లితాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు అరిష్ట నివార‌ణ తంత్రం చేయించుకుంటే మంచిది. క‌న్య‌, తుల, వృష‌భ‌, తుల రాశుల వారికి ఈ గ్ర‌హ‌ణం రాజ‌యోగాన్ని ఇస్తుంది.