Spiritual: పాకిస్థాన్‌లో.. శివుడి కన్నీటిబొట్టుతో ఏర్పడిన ఆలయం..!
Spiritual: ఆలయాలకు పెట్టిన పేరు భారతదేశం. ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. కానీ మనకు తెలీని విషయం ఏంటంటే.. పాకిస్థాన్‌లోనూ హిందూ ఆలయాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే పై ఫోటోలో ఉన్నది. ఈ నది పేరు కటాస్. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది.
పురాణాల ప్రకారం శివయ్య పార్వతి దేవిని మోసుకెళ్తుండగా ఆ ప్రాంతంలో ఆయన కన్నీటి బొట్టు పడిందట. ఆ కన్నీటి బొట్టే ఇలా కొలనుగా మారింది. మహాభారంలోని యక్షప్రశ్న ఇక్కడే జరిగిందట. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నారని కూడా చెప్తుంటారు. కృష్ణుడు ఇదే ప్రదేశంలో ఉండి శివలింగాన్ని తయారుచేసాడట. ఇక్కడున్న ఆలయం శివుడికే అంకితం చేయబడింది. ఈ కటాస్ సరస్సు చుట్టూ వివిధ ఆలయాలు కూడా ఉన్నాయి. నాల్గవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని చాలా కాలం పాటు పట్టించుకోకపోవడంతో ఆ కొలను ఇప్పుడు ఎండిపోయి ఉంది. ఆలయంలో ఎలాంటి పూజలు కూడా జరగడంలేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అనుమతి రావడంతో హిందువులు పాకిస్థాన్‌కు వెళ్లి మరీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.