AP: YSRCP నేత దాష్టీకం.. TDP నేత‌పై అమానుషం

AP: YSRCP నేత నాగేశ్వర రావు చేస్తున్న అక్రమాలు, భూకబ్జాల గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చి, కేసు పెట్టాడ‌నే క‌క్ష‌తో బనగానపల్లె నియోజ‌క‌వ‌ర్గం TDP తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ కుమార్ పై YSRCP గ్యాంగ్‌ దారుణంగా దాడి చేశారు. ఇంట్లోంచి లాక్కొచ్చి, న‌డిరోడ్డుపై చెప్పులతో కొట్టుకుంటూ పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ్లి రివ‌ర్స్ విజ‌య్ కుమార్ పైనే కేసు బ‌నాయించారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది.