Roja: బయటపడ్డ మంత్రి రోజా సోదరుడి బాగోతం
Roja: YSRCP మంత్రి రోజా సోదరుడి బాగోతం బయటపడింది. రోజా సోదరుడిపై YSRCP పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి షాకింగ్ ఆరోపణలు చేసారు. ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు అడిగారని ఆ డబ్బు తాము ఇచ్చి మోసపోయామని తెలిపారు. ఆ తర్వాత రోజాను సంప్రదించినా ఆమె స్పందించలేదని వాపోయారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక సాక్ష్యాలతో మీడియా ముందుకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేసారు.