Accident: స్కూటీని ఢీకొన్న కారు..మెట్రో పిల్ల‌ర్‌పై ఎగిరి ప‌డిన యువ‌తి

woman lands on metro pillar after accident

Accident: ఓ యువ‌తి స్కూటీపై వెళ్తుండ‌గా.. వెన‌కి నుంచి వ‌స్తున్న కారు ఢీకొంది. దాంతో ఆమె ఎగిరి ఏకంగా మెట్రో పిల్ల‌ర్‌పై ప‌డింది. ఈ ఘ‌ట‌న నోయిడాలో చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం నోయిడాలోని సెక్ట‌ర్ 16 నుంచి సెక్ట‌ర్ 18కి స్కూటీపై వెళ్తున్న మ‌హిళ‌.. కాస్త ఎత్తుగా ఉన్న రోడ్డుపై ప్ర‌యాణిస్తోంది. ఆ స‌మ‌యంలో కారు ఢీకొన‌డంతో ఆమె స్కూటీ నుంచి ఎగిరి పిల్ల‌ర్‌పై ప‌డింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు సహాయ‌క సిబ్బంది ఆమెను దించేందుకు పిల్ల‌ర్‌పైకి ఎక్కారు. వారు కూడా ఇరుక్కుపోవ‌డంతో అగ్నిమాప‌క సిబ్బందిని పిల‌వాల్సి వచ్చింది. స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో ఆమెను దగ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.