Pithapuram: పవన్ స్థానంలో నాగబాబా? వర్మా?
Pithapuram: సాధారణంగా ఒక నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్ధి గెలిచాడు అంటే అతను అదే నియోజకవర్గంలో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఉండాలి. ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. నిజానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులైతే తాము గెలిచిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటూ తమ బదులు మేనేజర్లనో లేక తమ కుటుంబ సభ్యులనో పెట్టి పాలన కొనసాగిస్తుంటారు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హిందూపూర్‌లో ఉండరు. ఆయన బదులు తన మేనేజర్‌ను పెట్టి పనులు చూసుకోమని చెప్తారు. పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండరు. ఆయన బదులు అంతా వైఎస్ అవినాష్ రెడ్డే చూసుకుంటాడు. అలా చాలా మంది నేతలు తమ సోదరులను పెట్టి వారు వేరే ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచిన తర్వాత కూడా పిఠాపురంలోనే ఉంటానని చెప్పి అక్కడ ఓ మంచి ఇల్లు కూడా తీసుకున్నారు.
ఒకవేళ పవన్ ఇక్కడ గెలిస్తే ఆయన పిఠాపురంలోనే సెటిల్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. గెలిచాక ఆయన మళ్లీ తన షూటింగ్‌ల కోసం హైదరాబాద్‌లోనే ఉండాలి. ఇందుకోసం పవన్ తన బదులు తన సోదరుడు నాగబాబును పిఠాపురంలో ఉంచనున్నట్లు సమాచారం. అయితే మరోపక్క పవన్ కోసం ప్రచారం చేస్తున్న వారిలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నిజానికి పవన్ స్థానంలో వర్మ ఉండి అన్ని పనులు చూసుకోవచ్చు. కానీ పవన్ వర్మకి ఇస్తారా లేక తన సోదరుడు నాగబాబుకి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.