Hema Malini: మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న ధ‌ర్మేంద్ర‌, హేమ‌మాలిని..!

Hema Malini and dharmendra married again

Hema Malini: అల‌నాటి తార‌లు.. ఎంద‌రికో ఆద‌ర్శ దంప‌తులైన హేమ‌మాలిని, ధ‌ర్మేంద్ర మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల క్రితం వీరిద్ద‌రూ త‌మ 44వ పెళ్లి రోజును ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రూ పూల‌మాల‌ల‌తో దిగిన ఫోటోల‌ను హేమ‌మాలిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. 1970లో వ‌చ్చిన తుమ్ హ‌సీన్ మై జ‌వాన్ సినిమాతో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అయితే అప్ప‌టికే ధ‌ర్మేంద్ర‌కు మ‌రొక‌రితో పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. దాంతో వీరి పెళ్లికి ఇరు వైపుల పెద్ద‌లు ఒప్పుకోలేదు. ఎన్నో అవ‌రోధాలు ఎదుర్కొని పెద్ద‌ల‌ను ఎదిరించి మ‌రీ వీరిద్ద‌రూ 1980లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇషా, అహ‌నా అని ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. మొద‌టి భార్య ప్ర‌కాష్ కౌర్‌తో ధ‌ర్మేంద్ర స‌న్నీ డియోల్, బాబీ డియోల్‌ల‌ను క‌న్నారు.