Janasena: ఆరు నెల‌ల్లో TDPలోకి విలీనం?

Janasena: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంతో క‌ష్ట‌ప‌డి స్థాపించిన జ‌న‌సేన పార్టీ తెలుగు దేశం పార్టీలో (Telugu Desam Party) విలీనం కాబోతోంది. మ‌రో ఆరు నెల‌ల్లో ప‌వ‌న్ (Pawan Kalyan) విలీనం అంశంపై నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? జ‌న‌సేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మ‌హేష్ (Pothina Mahesh) ఈ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసి నేత‌లు, జన‌సైనికుల్లో కొత్త టెన్ష‌న్ పుట్టించారు.

“” గెలిచే స్థానాలు వదిలేసి ఓడిపోయే స్థానాలు తీసుకున్న మేధావి పవన్ కళ్యాణ్. తెనాలి సీటు ఎందుకు త్యాగం చేయలేదు? కమ్మ వారు త్యాగాలు చేయరా? బీసీలే చేయాలా ? పవన్ కళ్యాణ్ పెద్ద స్వార్థపరుడు, మాయగాడు. ప్రజలు తెలివైన వారు. అందుకే రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. పవన్ నన్ను రాజకీయంగా చంపేశాడు, ఇది నాకు పునర్జన్మ. ఏ పార్టీలో చేరతానో, ఏ జెండా మోస్తానో నా ఇష్టం. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్లంతా మూడు జెండాలు మోసిన వారే. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అన్నారు. 25 రోజుల తరువాత అసలు జనసేన భవిష్యత్తు ఏంటి చెప్పగలవా పవన్ ? తీసుకున్న 21లో కూడా 80% తెలుగు దేశం వారికే టికెట్లు ఇచ్చావ్ “” అని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు మ‌హేష్