AP Elections: నమ్మండి ఇది ఇప్పటి ఫోటోనే.. YSRCP డ్రామా
AP Elections: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఇంటికి దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన చెల్లెలు షర్మిళ (ys sharmila) వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాజా రెడ్డి వివాహ వేడుకను ఆహ్వానించేందుకు షర్మిళ తాడేపల్లిగూడెంలోని జగన్ ప్యాలెస్‌కు వెళ్లారు. అయితే మూడేళ్ల తర్వాత ఇంటి ఆడపడుచు వస్తోందంటే.. మళ్లీ జగన్ దగ్గరకు తీసుకుంటారని మీడియాకు ఫోటోలు తీసుకునేందుకు పోజులు ఇస్తారని అందరూ అనుకున్నారు.
కానీ అలా జరగలేదు. అసలు మీడియాను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. లోపలి ఫోటోలను బయటికి అస్సలు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో జగన్, షర్మిళ దిగిన పాత ఫోటోలు YSRCP సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది ఇప్పటి ఫోటోనే అని నమ్మబలికేందుకు యత్నిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ షర్మిళతో కనీసం మాట్లాడినట్లు కూడా లేరని తెలుస్తోంది. షర్మిళ ఇంట్లోకి రాగానే జగన్ తన గదిలోకి వెళ్లిపోయారని దాంతో షర్మిళ ఆహ్వాన పత్రికను అక్కడే పెట్టేసి కాసేపు అలా కూర్చుని బయటికి వచ్చేసారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.