AP Elections: పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే సేఫ్?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ (TDP), జనసేన (janasena), YSRCPలు ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసాయి. ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలు రూపొందించాలని ప్లాన్లు వేసేస్తున్నారు. నేతల సీట్లలో మార్పులు పార్టీల నుంచి జంప్‌లు అవుతున్నాయి.
ఈ ఎన్నికలు తెలుగు దేశం పార్టీ, YCP పార్టీకి పెద్ద విషయమేమీ కాదు. కానీ జనసేనకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. సీఎం జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్.. (pawan kalyan) చివరికి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఈ ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగుతామని.. అధికారం తమదేనన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు గత ఎన్నికల కంటే రెట్టింపు సీట్లు రాకపోతే ఇంతకుమించి ఘోర అవమానం మరొకటి ఉండదు.
ఎందుకంటే పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పార్టీ పెట్టలేదని.. ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగుతున్నానని ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పారు. మరి ఈసారి పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. పవన్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లు పవన్ 2024 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
తాడేపల్లిగూడెం కూడా పవన్ పోటీ చేయదగిన నియోజకవర్గం. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఈ తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేసి గెలిచింది. తాడేపల్లిగూడెంలో 56 వేల మంది కాపులు ఉన్నారు. ప్రతి ఎన్నికలోనూ తాడేపల్లిగూడెం నుంచి కాపు వర్గానికి చెందినవారే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫు నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌కు 37 వేల ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ఉన్నారు. అయితే ఈయన పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో ఈ రెండు నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తే సేఫ్ అని నివేదికలు చెప్తున్నాయి.