Pithapuram: పెరుగుతున్న పవన్ గ్రాఫ్.. గీతకు షాక్
Pithapuram: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైస్సార్ కాంగ్రెస్ తరఫు నుంచి వంగ గీత బరిలోకి దిగనున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంగ గీతకు మద్దతుగా మరో ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపింది.
కూటమి లేకపోయి ఉంటే పిఠాపురం నుంచి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) తరఫున ఎస్వీఎస్ఎన్ వర్మ (SVSN Varma) బరిలోకి దిగేవారు. పవన్ పోటీ చేస్తుండడంతో వర్మకు షాక్ తగిలింది. తన సీటును పవన్‌కు ఎలా ఇస్తారు అని వర్మ మండిపడ్డాడు. దాంతో తెలుగు దేశం పార్టీని వీడి వర్మ ఒంటరిగా బరిలోకి దిగుతాడని.. దాంతో ఓట్లు చీలి వంగా గీతే గెలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ భావించింది.
కానీ అలా జరగలేదు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ కోటాలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో ఆయన పవన్‌కు మద్దతు తెలిపేందుకు ఒప్పుకున్నారు. పవన్‌కు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా తెలుగు దేశం, జనసేన కార్యకర్తలు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు వంగ గీత కోసం రంగంలోకి దింపిన స్టార్ క్యాంపెయినర్లు ఎవరి దారి వారు చూసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వంగ గీత ఒంటరిగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పిఠాపురంలో అమాంతం పెరిగిపోతుండడంతో వంగ గీత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:
Janasena: వర్మకు అంత సీన్ లేదు.. పిఠాపురంలో జనసేన ర్యాగింగ్?
Pithapuram పీఠం ఎవరిది? సర్వేలు ఏం చెప్తున్నాయి?