YS Sharmila: కేసీఆరే మళ్లీ సీఎం అవ్వచ్చు..తప్పు మనది కాదు
తెలంగాణలో మొత్తం 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila). దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆరే (cm kcr) మళ్లీ ముఖ్యమంత్రి అవ్వొచ్చని అలా జరిగితే ఆ తప్పు తమ పార్టీది కాదని అన్నారు. కాంగ్రెస్‌తో (congress) దీని గురించి చర్చించి ఓటు చీలకుండా పొత్తు పెట్టుకుని వెళ్దాం అని చెప్పినా కూడా కాంగ్రెస్ కలవలేదని తెలిపారు.
పాలేరు, మిర్యాలగూడ నుండి వైఎస్ షర్మిల పోటీ చేస్తారు. సికింద్రాబాద్ నుండి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగుతారు. కాంగ్రెస్ (congress) పార్టీలో షర్మిళ పార్టీ విలీనానికి బ్రేక్ పడటంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిళ రెడీ అయ్యారు. ముందు నుంచి షర్మిళ రాకను TPCC చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) వ్యతిరేకిస్తూ వస్తున్నారు. షర్మిళ పార్టీ నుండి పోటీ కోసం రెండు మూడు రోజుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.