Viveka Murder Case: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంలో సునీత పిటిషన్‌

kadapa: వైఎస్‌ వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ దర్యాప్తు(cbi investigation) వేగవంతం చేసిన క్రమంలో కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి(kadapa mp avinash reddy) తండ్రి భాస్కర్ రెడ్డి(bhaskar reddy), ఆయన అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి(uday kumar reddy)ని అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఎంపీ అవినాష్‌ను కూడా సీబీఐ అరెస్టు చేయాలని భావించినా.. ఆయన ముందస్తుగానే తెలంగాణ హైకోర్టు(telangana high court)ను ఆశ్రయించడంతో ఆయన్ని ఇప్పుడే అరెస్టు చేయవద్దని సీబీఐకి కోర్టు ఆదేశించింది. ఇక నిన్నటి నుంచి ముగ్గురినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె.. వైఎస్‌ సునీత(ys sunitha) సుప్రీంకోర్టు(suprem court)ను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు అవినాష్‌ రెడ్డిని ఈ నెల 25వరకు అరెస్టు చేయవద్దని చెప్పడంతో వారి తీర్పుపై ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌(petition) దాఖలు చేశారు. దీన్ని ధర్మాసనం శుక్రవారం అనగా రేపు విచారించే అవకాశం ఉంది.

వివేకా హత్యకు సంబంధించి అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. సునీత తరపు లాయర్‌ చెబుతున్నారు.హత్య చేసినట్లుగా ఒప్పుకొంటే కోట్లు ఇస్తామని గంగాధర్‌ రెడ్డికి ఆఫర్‌ ఇచ్చారని.. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌ రెడ్డి చెప్పినట్లు అప్పటి సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని స్వయంగా సుప్రీంకోర్టు గుర్తించిందని.. పిటిషనర్‌కు వ్యతిరేకంగా కొలేటరల్‌ ఎవిడెన్స్‌ ఉందని ఆయన వివరించారు. అవినాశ్‌ రెడ్డి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని.. దర్యాప్తు సవ్యంగా సాగుతోందని స్పష్టం చేసిందని సునీత లాయర్‌ గుర్తు చేశారు.