Vijaya Sai Reddy: అచ్చెన్నా.. ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా
Vijaya Sai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 3గా ఉన్న విజయ సాయి రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు యత్నించారని అన్నారు అచ్చెన్నాయుడు. కానీ తాము ఒప్పుకోలేదంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దాంతో విజయ సాయి రెడ్డి దీనిపై స్పందించారు.
“” అచ్చంనాయుడూ! దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను TDP అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా… నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో…ఆన్…నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా “” అని సెటైర్ వేసారు.