Rice Diabetes: 2025 నాటికి మధుమేహాన్ని తగ్గించే బియ్యం
Rice Diabetes: ఆసియా ఖండంలో దాదాపుగా ఎక్కువ శాతం మంది తినేది అన్నమే. ఇదే ఖండంలో 60 శాతానికి మందికి పైగా జనాభా ఈరోజు డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఎందుకంటే అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఏ ఆహారం తిన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఆల్రెడీ మధుమేహంతో బాధపడేవారికి అస్సలు మంచిది కాదు.
ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో ఉన్న అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి (IRRI) చెందిన శాస్త్రవేత్తలు కొత్త రకం బియ్యం గురించి కనుగొన్నారు. ఈ బియ్యం తింటే మధుమేహ రిస్క్ తగ్గుతుందట. ఎందుకంటే ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందట. ఇది చూడటానికి రెగ్యులర్‌గా తినే వైట్ రైస్ లాగే ఉంటుంది కానీ బియ్యం చిన్నగా ఉంటుంది. 2025 నాటికి శాస్త్రవేత్తలు ఈ బియ్యానికి సంబంధించిన అంశాలను ఆసియా ఖండంలో బియ్యం పండించే రైతులకు తెలియజేస్తారట. అలా భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌లోనూ ఈ బియ్యాన్ని పండించే అవకాశాలు ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్ మంది డయాబెటిస్ ఉంది. 2045 నాటికి ఈ సంఖ్య కాస్తా 783కి చేరుతుంది. ఇప్పటికే IRRI 125 IRRI 147 పేరుతో రెండు రకాల బియ్యాన్ని శాస్త్రవేత్తలు రిలీజ్ చేసారు. ఇవి బాగా సక్సెస్ అయ్యాయి. అయితే డయాబెటిస్ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అన్ని రకాల ప్రాణాంతక వ్యాధులు మధుమేహం వల్లే వస్తాయంటుంటారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. సాధారణ మధుమేహం కంటే డయాబెటిక్ నెఫ్రోపతీ, కార్డియో వంటివి మరింత డేంజర్. కళ్లు పోవడం, కిడ్నీలు పోవడం, గుండెపోటు రావడానికి ఇదే మూలకారణం.
డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామాలు చేయకూడదా?
Rice Diabetes: ఇదో అపోహ. డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామం చేయకూడదని అలా చేస్తే షుగర్ లెవెల్స్ పడిపోతాయని అంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు ప్రముఖ ఫిజిషియన్ దిలీప్ గూడె (dilip gude). నిజానికి మంచి వ్యాయామం షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని అంటున్నారు. ఎక్కువగా కార్డియో వ్యాయామాలు రెసిస్టెన్స్ ట్రైనింగ్ డయాబెటిక్ పేషెంట్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట.
షుగర్ ఎక్కవ తింటే డయాబెటిస్ వస్తుందా?
అలాగని ఏమీ లేదు. షుగర్ ఎక్కవగా తినేవారికి డయాబెటిస్ రాదు కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం చెక్కర తినకూడదు. అయితే డయాబెటిస్ ఉన్నా లేకపోయినా వైట్ షుగర్‌కి దూరంగా ఉంటే మున్ముందు అనారోగ్యాలకు చెక్ పెట్టచ్చు. కావాలంటే చెక్కరకు బదులు బెల్లం వాడుకుంటే మంచిది.
ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికీ షుగర్ లేదు కాబట్టి మనకూ రాదా?
అలాగని ఏమీ లేదు. అదృష్టం బాగోలేకపోతే మన జీవనశైలి సరిగ్గా లేకపోయినా షుగర్ వస్తుంది. బీఎంఐ ఎక్కువగా ఉండటం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
షుగర్ వ్యాధి అదుపులోనే ఉంది కాబట్టి ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకోవాలా?
అలా కుదరదు. ఎందుకంటే డయాబెటిస్ అనేది చాప కింద నీరులాంటిది. అదుపులోనే ఉంది కదా అని ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకుంటాం అంటే కుదరదు. ఎందుకంటే అప్పటికే అది కిడ్నీలకో గుండెకో కంటికో డ్యామేజ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టేసి ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు అది కంట్రోల్లో ఉన్నప్పటికీ ప్రతి మూడు నెలలకు ఓసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి