Vasantha Krishna Prasad: చంద్రబాబుని తిట్టవు.. ఎలా ఉంచుకోవాలి అని జగన్ అన్నారు
Vasantha Krishna Prasad: YSRCP మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన్ను తన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోస్ట్ నుంచి తప్పించారు. ఇన్‌ఛార్జి పోస్ట్‌ల నుంచి తప్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈయన ఒకరు. దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేసారు. అయితే ఆయన రాజీనామా చేసాక పార్టీపై.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (jagan mohan reddy) షాకింగ్ కామెంట్స్ చేసారు. (Vasantha Krishna Prasad)
చంద్రబాబుని తిట్టవు.. పార్టీలో ఎలా ఉంచుకోవాలి
అయితే కృష్ణప్రసాద్‌ను ఇన్ఛార్జ్ పొజిషన్ నుంచి తప్పించినప్పుడు ఆయన నేరుగా జగన్‌ను కలిసేందుకు వెళ్లారు. నేను ఈ నియోజకవర్గం నుంచి తప్పకుండా మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు పక్కనపెట్టారు అని జగన్‌ను ప్రశ్నించారు. ఇందుకు జగన్ సమాధానంగా.. నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్‌ని కానీ తిట్టావా? అలాంటప్పుడు నిన్ను పార్టీ ఎందుకు ఓన్ చేసుకుంటుంది. వారిని నోటికొచ్చినట్లు తిట్టినవారికే టికెట్ ఇస్తాం అని జగన్ తనతో చెప్పినట్లు కృష్ణప్రసాద్ వెల్లడించారు. (Vasantha Krishna Prasad)
కృష్ణ ప్రసాద్ స్థానంలో ZPTC సభ్యుడు అయిన స్వర్ణాల తిరుపతిరావును ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. యాదవ వర్గానికి చెందిన తిరుపతిరావుకు ఈ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. వచ్చే ఏపీ ఎన్నికల్లో మైలవరం టికెట్ ఆయనకే ఇస్తారని తెలుస్తోంది. ఈ ముక్క ముందే గ్రహించిన కృష్ణ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేసారు.