up: ఎన్‌కౌంటర్లపై ప్రజలు ఫుల్ ఖుష్‌.. యోగీ మోడల్‌ ఇదేనా!

delhi: ఉత్తర్‌ప్రదేశ్‌(uttar pradesh)లో వరసగా జరిగిన ఎన్‌కౌంటర్ల(encounters)తో సీఎం యోగి ఆదిత్యా నాథ్‌(yogi adityanath) పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేస్తున్న తీరుపై యోగిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా యూపీ తరహా పరిపాలన తీసుకొస్తామని ఆ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. గతంలో మోదీ పరిపాలించిన గుజరాత్‌ మోడల్‌ పాలన పోయి.. తాజాగా తమ తమ రాష్ట్రాల్లో యోగీ తరహా పాలన రావాలని ప్రజలు కోరుతున్నారు.

యోగీ ఆధిత్యా నాథ్‌ అధికారంలోకి వచ్చే ముందు సురక్షా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే.. మాఫియాను అంతం చేస్తామని అప్పట్లో అధికారంలో ఉన్న మాయావతి చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించలేదు. యోగీకి మద్దతుగా నిలిచి గెలిపించారు. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన 2017 నుంచి 2023 మధ్య కాలంలో 183 మందిని ఎక్‌కౌంటర్‌ చేశారు. పదివేలకు పైగా ఎన్‌కౌంటర్‌లు(uttar pradesh encounters) చేసినట్లు నమోదయ్యాయి. వాస్తవానికి యూపీలో గతంలో రూల్‌ ఆఫ్‌ లా అనేది సక్రమంగా ఉండేది కాదు.. ఈ క్రమంలో అక్రమార్కులను ఏరివేయడంలో యోగీ సఫలీకృతులయ్యారు.

పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రమాదం పొంచి ఉంటుందని.. నేరస్తులనే వారు చంపుతారని గ్యారెంటీ ఉండదు.. అమాయకులు, అనుమానితులను చంపే అవకాశం కూడా ఉంది. క్రిమినల్‌ జస్టిస్‌లో ఓ పద్దతి ఉండాలి. కోర్టు ద్వారా శిక్ష పడటం అనేది ఒక విధానం అని వారు అంటున్నారు. కానీ యోగీ మాత్రం బుల్డోజర్‌, ఎన్‌కౌంటర్‌ పద్దతిలో పరిపాలన సాగిస్తున్నారు. అయినా ప్రజలు అక్కడ హర్షిస్తున్నారు. దీని కారణం లేకపోలేదు. ప్రజలకు సరైన న్యాయం జరగనప్పుడు.. క్రిమినాలిటీ పెరిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్న తరుణంలో ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది.. ఈక్రమంలో ప్రభుత్వాలు చేసే ఇన్‌స్టాంట్‌ చర్యలకు ప్రజలు మద్దతుగా నిలుస్తారు. యూపీలో ఇప్పుడు అదే జరుగుతోంది.