Bhupesh Baghel: స‌మావేశంలో గేమ్ ఆడుకుంటూ కూర్చున్న సీఎం

ఓ ప‌క్క కీల‌క స‌మ‌వేశం జ‌రుగుతుంటే.. ఛ‌త్తీస్‌గ‌డ్ సీఎం భూపేష్ భ‌గేల్ (bhupesh baghel) గేమ్ ఆడుకుంటూ కూర్చోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. భూపేష్ గేమ్ ఆడుకుంటున్న స‌మ‌యంలో తీసిన ఫోటోను BJP లీక్ చేసి ట్రోల్ చేసింది. ఎటూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఛ‌త్తీస్‌గ‌డ్‌లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని తెలిసి భూపేష్ ఇలా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నార‌ని BJP ఆరోపించింది. దీనికి భూపేష్ బ‌దులిస్తూ.. “” అవును. నాకు క్యాండీ క్ర‌ష్ వంటి గేమ్స్ ఆడుకోవ‌డ‌మంటే ఇష్టం. కానీ నాకు జాతీయ గేమ్స్ అంటే మ‌రీ ఇష్టం. ఇక అధికారంలోకి ఎవ‌రు రావాలి అనేది ప్ర‌జ‌లు డిసైడ్ చేస్తారు “” అని ధీటుగా స‌మాధానం ఇచ్చారు.