Telangana: రైతుల‌కు గుడ్ న్యూస్..!

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతన్న‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌త్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పంట బీమా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇందుకోసం రైతులు కొంత ప్రీమియం డ‌బ్బు భ‌రించ‌గ‌లిగితే మిగ‌తా మొత్తం ప్ర‌భుత్వం ఇస్తుంది. రైతు యూనిట్‌గా ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతుంది. వ‌చ్చే వ‌ర్షాకాలం నుంచి ఈ ప‌థ‌కం అందుబాటులోకి రానుంది. 2020లో ఫ‌స‌ల్ బీమాను అప్ప‌టి తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దాంతో రైతులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఖ‌జానా నుంచే రైతుల‌ను ఆదుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ బీమా లేక‌పోవ‌డం వ‌ల్లే 21 ల‌క్ష‌ల ఎకరాల్లో పంట న‌ష్టం జ‌రిగింది.