Sunitha Reddy: వివేకం సినిమా చూసి భయమేసింది
Sunitha Reddy: తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమాను తానూ చూసానని.. చివరి అరగంట సీన్లను చూసినప్పుడు చాలా భయమేసిందని అన్నారు ఆయన కుమార్తె సునీతా రెడ్డి. వివేకం అనేది సినిమానో లేక డాక్యుమెంటరీనో అర్థంకావడంలేదని అన్నారు. ఈ సినిమాను ఎవరు తీసారో తనకు తెలీదని కానీ చాలా ధైర్యంగా తీసారని పేర్కొన్నారు.
“” సినిమాలో చూపించినదాని కంటే ఘోరంగా నిజ జీవితంలో జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని జగన్ అన్నను అడుగుతున్నాను. అన్నగా కాకపోయినా రాష్ట్ర సీఎంగా అయినా న్యాయం చేయండి. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటాను. ఐదేళ్ల నుంచి ఒంటరిగా పోరాడుతున్నాను. ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చి మాట్లాడాల్సి వస్తోందంటే.. ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ జగన్ మా నాన్న పేరును వాడుకుని గెలవాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు ఈ ఎన్నికల్లో షర్మిళ గెలవాలి… అవినాష్ రెడ్డి మాత్రం కచ్చితంగా ఓడిపోవాలి.“ అని తెలిపారు.