Chandrababu కు IT నోటీసులపై సుజనా చౌదరి కామెంట్స్

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu) ఇటీవ‌ల IT నోటీసులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై BJP నేత సుజ‌నా చౌద‌రి (sujana chaudhary) స్పందించారు. “” నోటీసులు వ‌చ్చిన‌వారిని అడ‌గండి. ఆయ‌న‌కు ఎందుకు వ‌చ్చాయో నాకేం తెలుసు. ఇక జ‌మిలి ఎన్నిక‌ల గురించి నేను ఇప్పుడే చెప్ప‌లేను. ఎందుకంటే BJP అనేది జాతీయ పార్టీ. ఆ పార్టీ తీసుకునే నిర్ణ‌యాల‌పై నాలాగా ఎవ‌రు ప‌డితే వారు మాట్లాడ‌కూడ‌దు. త‌ప్ప‌కుండా ఇండియాకు మంచి రోజులు రాబోతున్నాయ్ అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను “” అని తెలిపారు.