RGV: ఒక రోగిని ప్రజలు సీఎంగా ఎంచుకుంటారా?
RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ TDP అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు నారా లోకేష్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలతో పంచుకుంటూనే ఉన్నారు. అయితే ఏ రాష్ట్ర ప్రజలు అయినా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిని తమ ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారా.. లేదా రోగాలు ఉన్న వ్యక్తిని సీఎంగా ఎంచుకుంటారా అని ప్రశ్నించారు.
కొంతకాలంగా నారా లోకేష్ (nara lokesh) చంద్రబాబు నాయుడు అనారోగ్యానికి సంబంధించి ఆయన అంతర్గత అవయవాల పనితీరు గురించి బయట పెడుతున్నారని అది చాలా దారుణం అని అన్నారు. బాహుబలి సినిమాలో విలన్లతో పోరాడాల్సిన హీరో అనారోగ్యంతో మంచంపై ఉంటే ఎలా ఉంటుందో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి సీఎం అయితే అలాగే ఉంటుందని ఎద్దేవా చేసారు.