Revanth Reddy: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.. రేవంత్ అలక
తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ (telangana screening committee) సమావేశం సమయంలో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) అలిగారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు తుది జాబితాలో సీట్లు లేకపోవడం.. బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. తుది జాబితాపై రేవంత్, ఇతర సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటామని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అనడంతో రేవంత్ కోపంతో వెళ్లిపోయారు.