Tirupati Reddy: రేవంత్ రెడ్డి సోదరుడికి గుండెపోటు
Tirupati Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. అర్థరాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తిరుపతి రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ను వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.