Renuka Chowdary: KCR.. నీకు సిగ్గుంటే రాజీనామా చేయ్..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి KCRపై మండిప‌డ్డారు కాంగ్రెస్ నేత రేణుకా చౌద‌రి (renuka chowdary). గ్రూప్ 1, TSPSC ప‌రీక్ష‌లు లీక్ అవుతున్నాయ‌ని అయినా కూడా రాష్ట్రం విద్యార్థుల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలేద‌ని మండిప‌డ్డారు. గ్రూప్ 1 ప‌రీక్ష కార‌ణంగా చిక్క‌డ‌ప‌ల్లిలో ప్ర‌వ‌ళిక అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో రేణుకా చౌద‌రి ప్రెస్ మీట్ పెట్టారు. ఓ ప‌క్క ప్ర‌వ‌ళిక చ‌నిపోయింది ల‌వ్ ఫెయిల్యూర్ వ‌ల్ల అని పోలీసులు చెప్తున్న‌ప్ప‌టికీ.. కాదు ఆమె గ్రూప్ 1 ప‌రీక్ష ర‌ద్దు అవ్వ‌డం వ‌ల్లే ఒత్తిడి త‌ట్టుకోలేక చ‌నిపోయింద‌ని తోటి విద్యార్థులు రేణుకా చౌదరితో క‌లిసి ఆరోపిస్తున్నారు.

ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలీగానే తోటి విద్యార్థులు న్యాయం కోసం ధ‌ర్నాలు చేస్తే పోలీసులు వారిని చావ‌గొట్టార‌ని వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని డిమాండ్ చేసారు. గ్రూప్ 1, TSPSC ప్ర‌శ్నా పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయో ఒక సిట్టింగ్ జ‌డ్జ్‌తో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని అన్నారు.