RGV: అత‌నికి అంత గౌర‌వం ఎందుకండి..!

రోజా.. నీ బ్లూ ఫిలింస్ నా ద‌గ్గ‌రున్నాయ్.. నువ్వు ఎవ‌రితో తిరిగావో అన్నీ మాకు తెలుసు అంటూ TDP మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణమూర్తి (bandaru satyanarayana murthy) చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా మాట్లాడలేదు కానీ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ (rgv) మాత్రం మ‌హిళా క‌మిష‌న్ అధ్య‌క్షురాలు వాసిరెడ్డి ప‌ద్మ‌ను (vasireddy padma) ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు.

రోజాపై ద‌రిద్రంగా కామెంట్స్ చేసిన వ్య‌క్తి ప‌ట్ల యాక్ష‌న్ తీసుకోరా ప‌ద్మ‌గారూ అంటూ వ‌ర్మ ట్వీట్ చేసారు. ఆయ‌న నిన్న రాత్రి ట్వీట్ చేయ‌గా.. ఇప్పుడు వాసిరెడ్డి ప‌ద్మ బండారుకు నోటీసులు జారీ చేసారు. అయితే నోటీసులో శ్రీ బండారు స‌త్య‌నారాయ‌ణమూర్తి అని సంబోధించ‌డం ప‌ట్ల వ‌ర్మ కాస్త హ‌ర్ట్ అయ్యారు. యాక్ష‌న్ తీసుకున్నందుకు వాసిరెడ్డి ప‌ద్మ‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ.. అలా ఒక మ‌హిళ గురించి అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తిని శ్రీ అని సంబోధించ‌డం అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. (rgv)