Prakash Raj: చంద్రయాన్ 3ని వెక్కిరించిన నటుడు
ప్రకాష్ రాజ్ (prakash raj) ఎప్పటినుంచో BJPపై, ప్రధాని నరేంద్ర మోదీపై (narendra modi) కోపంగా ఉన్నారు. ఆయనకు BJP చేస్తున్న చర్యల పట్ల ఇసుమంతైనా గౌరవం లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా BJPని ఆ పార్టీకి సంబంధించినవారిని నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కాబట్టి తన అభిప్రాయాలను వెల్లడించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఆయన ఇస్రో (isro) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ -3 (chandrayaan 3) మిషన్‌పై సెటైర్ వేసారు.
ఎప్పటికప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఫొటోలను పంపుతున్నట్లు ఇస్రో ట్విటర్‌లో అప్డేట్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ట్విటర్‌లో ఒక ఫొటో షేర్ చేసారు. మోదీ పేదవాడి గెటప్‌లో చాయ్ కలుపుతున్న కార్టూన్ ఫొటో అది. దానిని షేర్ చేస్తూ విక్రమ్ పంపిన లేటెస్ట్ ఫొటోనా అని కామెంట్ చేసారు. దాంతో వేలాది మంది ఆయనపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇస్రోని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు అని మండిపడుతున్నారు. (prakash raj)