Posani: చంద్రబాబుని పాడుచేసింది భువనేశ్వరే..!
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఇప్పుడు ఇంత క్రిమినల్‌గా మారి జైలుకి వెళ్లాడు అంటే అందుకు కారణం నారా భువనేశ్వరి (nara bhuvaneswari) అని షాకింగ్ కామెంట్స్ చేసారు APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి (posani). ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెసే అని.. నందమూరి తారక రామారావు (NTR) తెలుగు దేశం పార్టీని (tdp) పెట్టినప్పుడు కాంగ్రెస్‌ని (congress) అమ్మనా బూతులు తిట్టి మామ పెట్టిన పార్టీలోకి రావాలనుకున్నారని అన్నారు. ఇదే విషయం ఆనాడు చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో చెప్తే.. ఎందుకండి మనకు రాజకీయ భిక్షపెట్టిన పార్టీని వదిలేసి TDPలోకి వెళ్లడం అని చెప్పకుండా తన తండ్రి దగ్గరికి వెళ్లి తన భర్తను పార్టీలో చేర్చుకోమని వేడుకుందని అన్నారు.
“” ఏమ్మా భువనేశ్వరి.. నీ భర్త కాంగ్రెస్ వదిలేస్తానంటే నీ తండ్రిని ఒప్పించి ఆయన్ను వెన్నుపోటు పొడిచేలా చేసింది నువ్వు కాదా? నీ తండ్రిపై చెప్పులు విసిరించినప్పుడు కనీసం రెండు కన్నీటి చుక్కలైనా రాల్చావా? నీ తండ్రిని చంపేస్తే నీ భర్త ఆ తర్వాత నీ కొడుకు రాష్ట్రాన్ని ఏలేస్తారని కలలు కన్నావు. అనుకున్నది సాధించావు. ఈరోజు నువ్వు సత్యమేవజయతే అని నిరాహార దీక్ష చేస్తుంటే నవ్వు వస్తోంది. ఇప్పటికైనా కాస్త మీడియా ముందుకు వచ్చి.. నా భర్త తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. లేకపోతే ఇంటకి వస్తారు అని ఒక దండం పెట్టు. కనీసం పరవు అన్నా దక్కుతుంది.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తల్లిని నారా లోకేష్ నోటికొచ్చినట్లు తిడితే పవన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పవన్ అమాయకుడు కాబట్టి.. తన కుటుంబాన్ని, తన పార్టీని నోటికొచ్చినట్లు తిట్టినా.. ఇప్పుడు తన ముందు కన్నీళ్లు పెట్టుకునేసరికి TDPతో పొత్తు పెట్టేసుకున్నాడు. ఇంత చెప్తున్నా పవన్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఇక అతన్ని దేవుడే కాపాడాలి. కాపు కులస్తులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏపీలో మీ కాపుల శాతం ఎక్కువగా ఉంది కాబట్టి.. ఎవ్వరి మాట వినకుండా మీ మనసాక్షి ఎవరికి ఓటు వేయమని చెప్తుందో వారికే వేయండి “” అని తెలిపారు పోసాని.