Posani: నిమ్మగడ్డను చెప్పుతో కొట్టే దమ్ముందా?
Posani: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి.. (Chandrababu Naidu) మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) నడిరోడ్డుపై చెప్పుతో కొట్టే దమ్ముందా అని ప్రశ్నించారు YSRCP నేత పోసాని కృష్ణమురళి. వాలంటీర్ల చేత వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఆపించేసింది నిమ్మగడ్డే అని తమకు సంబంధం లేదని తెలుగు దేశం వారు ఆరోపిస్తున్నారని పోసాని అన్నారు. అదే నిజం అయితే నిమ్మగడ్డను నడిరోడ్డుపైకి తీసుకొచ్చి చెప్పుతో కొట్టగలరా అని ప్రశ్నించారు. అదే జరిగితే తాను చంద్రబాబు నాయుడు పాదాలపై పడి జై చంద్రబాబు అని నినాదాలు చేస్తానని సవాల్ విసిరారు.
“” నాకు జగన్ తర్వాత అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఆధ్వర్యంలో దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలన్నీ బాగున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నడుచుకుంటుంది. అందుకే మేనేజ్మెంట్ అంత దరిద్రంగా ఉంది. పురంధేశ్వరికి, సీఎం రమేష్‌కు నిజంగా దమ్ము, నిజాయతీ ఉంటే వారు మంచివారు అని నడిరోడ్డుపై నార్కో టెస్ట్ చేయించుని నిరూపించమనండి. వారు నిజాయతీపరులు అని తేలితే వారి చేత నేను చెప్పులతో కొట్టించుకుని దేశం వదిలి వెళ్లిపోతాను. ఎన్నికలు వస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ఎవరు మంచి చేసారో చూసి ఓటు వేయాలని కోరుకుంటున్నాను “” అని తెలిపారు.