Ponnala Lakshmaiah: రేవంత్ రెడ్డిపై పొన్నాల ఫైర్
తన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (revanth reddy) ఫైర్ అయ్యారు పొన్నాల లక్ష్మయ్య (ponnala lakshmaiah). అసలు రేవంత్ ఎవరు తన గురించి మాట్లాడటానికి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్నీ ఇస్తుంది కానీ రేవంత్ లాంటి వాళ్ల వల్ల అవమానాలు ఎదుర్కోలేక పార్టీ పరువు పోతోందని అన్నారు. మాట్లాడితే ఓడిపోయాను కాబట్టే వేరే పార్టీలో చేరుతున్నానని అంటున్నాడని.. అసలు 40 ఏళ్ల చరిత్ర ఉన్న తానెక్కడ.. రేవంత్ ఎక్కడ అని ప్రశ్నించారు. అసలు రేవంత్ పార్టీలోకి వచ్చి గెలిచిందెప్పుడు అని అడిగారు. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని మండిపడ్డారు. అనంతరం BRS మంత్రి KTRతో చర్చ గురించి స్పందిస్తూ.. సీఎం KCRతో మాట్లాడమని చెప్పారని త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు. (ponnala lakshmaiah)