Janasena: ఓపిక ప‌ట్టండి.. లెక్క అర్థ‌మ‌వుతుంది..!

Janasena: మొత్తానికి తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల (Bharatiya Janata Party) మ‌ధ్య పొత్తు కుదిరింది.. సీట్ల షేరింగ్ లెక్క తేలింది. 175 స్థానాల‌కు గానూ 144 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పోటీ చేస్తుంది. 25 ఎంపీ సీట్ల‌కు గానూ 17 స్థానాలు తెలుగు దేశం తీసుకుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి 6 లోక్ స‌భ‌, 10 అసెంబ్లీ సీట్లు దక్కాయి. ఇక జ‌నసేన‌కు (Janasena) మాత్రం 2 లోక్ స‌భ 21 శాస‌నస‌భ స్థానాలు ద‌క్కాయి. నిజానికి ఇక్క‌డ త్యాగం చేసింది ఎవ‌రైనా ఉన్నారంటే అది జన‌సేన పార్టీ మాత్రమే.

జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన త్యాగం, వేసిన లాంగ్ టర్మ్ బెనిఫిట్ అడుగుని అర్థం చేసుకోవ‌డానికి కొంచెం సమయం పట్టొచ్చు. ముఖ్యంగా పూర్తి రాజకీయ అవగాహన లేని వాళ్లకి జ‌న‌సేనాని లెక్క అర్థ‌మ‌వ్వాలంటే కాస్త వేచి చూడాల్సిందే. తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన శ్రేణులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిచాల్సిన స‌మ‌యం ఇది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ భవిష్యత్తుకి భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీగా హామీలు ఇచ్చిన మీదటే వాళ్ల కోసం కొన్ని సీట్లు తాత్కాలికంగా వదులుకోవడం జరిగిందని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. ఆ సీట్లు పోయిన ప్రముఖ జనసేన నాయకులుకి కూడా భవిష్యత్తులో ఏం చెయ్యాలో నిర్ణ‌యించాకే అవి వదులుకోవడం జరిగిందని టాక్. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి సీట్ల విష‌యంలోనే ఈ త్యాగాలు జ‌రిగాయి. ఏం ఫ‌ర్వాలేదు. జ‌న‌సేనాని లెక్క అర్థ‌మ‌వ్వాలంటే జ‌స్ట్ వెయిట్ అండ్ వాచ్ అని అంటున్నారు జ‌న‌సేన ముఖ్య నేత‌లు.