Pawan Kalyan: న‌న్ను ఎమ్మెల్యేగా గెలిపించ‌ని వారికి ప్ర‌శ్నించే హ‌క్కు లేదు

Pawan Kalyan: తెలుగు దేశం పార్టీతో (TDP) పొత్తు ప్ర‌క‌టించిన‌ప్పుడు కొంద‌రు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ఉంటేనే త‌న‌కు ఓటు వేస్తామ‌ని అన్నార‌ని తెలిపారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌లేని వారు సీఎం అభ్య‌ర్ధిగా ఉంటే మాత్రం ఎందుకు ఓటు వేస్తార‌ని అడిగారు. అలాంట‌వారికి త‌న‌ను ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. తాను తెలుగు దేశం పార్టీ వెన‌క న‌డ‌వ‌డంలేద‌ని.. తెలుగు దేశంతో క‌లిసి న‌డుస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో మాజీ సీఎం కూతురు ష‌ర్మిళ పోటీ చేయ‌లేక‌పోయార‌ని.. కానీ తన పార్టీ పోటీ చేసి స‌త్తా నిరూపించుకుంద‌ని గుర్తుచేసారు. త‌న సినిమాలు ఆపేసినా బెదిరించినా ఏనాడూ తాను ఢిల్లీ పెద్ద‌ల సాయం కోర‌లేద‌ని అలాంటి వ్య‌క్తిత్వం త‌నది కాద‌ని తెలిపారు ప‌వ‌న్.