మీ నాన్న దోచిపెట్టిన సొమ్మును కూడా చెల్లికి ఇవ్వలేవా జగన్?
“” జగన్ మాట్లాడితే మాట తప్పను మడమ తిప్పను అంటాడు. కన్నతండ్రికి ఇచ్చిన మాటే తప్పావు నువ్వు. మీ నాన్నగారు బతికున్నప్పుడు ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నీకు ఇచ్చి ఒరేయ్ నాన్నా నువ్వు చెల్లి ఈ అక్రమ ఆస్తులను కలిసి పంచుకోండ్రా అని చెప్తే నువ్వు సరే నాన్నా అని మాటిచ్చి ఈరోజు అదే చెల్లిని మోసం చేసావు. అలాంటి నువ్వు నారా లోకేష్ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడతావ్. మేం చకచకా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తుంటే నీకు మైండ్ బ్లాంక్ అయినట్లుంది. దిశా చట్టం అని గగ్గోలుపెడుతున్నావ్. అసలు దిశా చట్టమే లేదు అంటే వినిపించుకోవా? తెలిసి మాట్లాడుతున్నావా తెలీక మాట్లాడుతున్నావా? జాతీయ మీడియా వాళ్లు ఏదన్నా ప్రశ్న వేస్తే ఇది చాలా పెద్ద ప్రశ్న అని తప్పించుకునే నీకు ఏకధాటిగా ఏమడిగినా సమాధానం చెప్పే లోకేష్‌తో పోలికా? అన్నీ మూసుకుని నీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటావో బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటావో ఉండు. “” అని మండిపడ్డారు.