Interim Bail: చంద్ర‌బాబుకు కోర్టు పెట్టిన ష‌ర‌తులు ఇవే..!

Chandrababu Naidu: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరు అయ్యింది. ఆయ‌న అనారోగ్య కార‌ణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఆయ‌న‌కు నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ (interim bail) జారీ చేసింది. అయితే ఒక ల‌క్ష పూచీక‌త్తుపై ఇద్ద‌రి సంత‌కాల‌తో కోర్టు ఈ బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూ కొన్ని ష‌ర‌తుల‌ను కూడా పెట్టింది. అవేంటంటే..

*కేవ‌లం అనారోగ్య కార‌ణాల దృష్ట్యా మాత్ర‌మే మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చింది.

*న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు బెయిల్ మంజూరు చేయ‌గా.. 24 సాయంత్రానికి మ‌ళ్లీ కోర్టు ముందు హాజ‌రై రిమాండ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. (interim bail)

*రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ న‌వంబ‌ర్ 10న జ‌ర‌గ‌నుంది.

*హాస్పిట‌ల్‌కు వెళ్లేందుకు మాత్ర‌మే చంద్ర‌బాబు బ‌య‌టికి రావాల్సి ఉంటుంది.

*ఎలాంటి ప్రెస్ మీట్లు, రాజ‌కీయ ప్ర‌సంగాలు, ప్ర‌చారాల్లో పాల్గొన‌డానికి వీల్లేదు.

*చంద్ర‌బాబు నాయుడు ఈ నాలుగు వారాల పాటు ఫోన్లు కూడా వాడ‌టానికి వీల్లేదు. (interim bail)

*వీటిలో ఏ ఒక్క రూల్ ఉల్లంఘించినా వెంట‌నే ఆయ‌న మ‌ధ్యంత‌ర బెయిల్‌ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంటుంది.